కుమారస్వామి తిప్పను పరిశీలించిన చైర్మన్.. అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలో ఎంతో ప్రాచున్యత కలిగి శ్రీసుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న కుమారస్వామి తిప్ప దేవాలయమునకు 1995 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు కుంభాభిషేకం జరగకపోవడం ఎంతో దారుణమని, ఏ దేవాలయమునకైనా 12 సంవత్సరాలకు ఒకసారి జరపాల్సిన కుంభాభిషేకం జరగకపోతే దేవాలయమునకు మరియు దేవాలయమునకు విచ్చేసిన భక్తులకి మంచిది కాదని ఈ విషయాన్ని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే గారు వెంటనే కుంభాభిషేకం ఏర్పాట్లు చూడవలసిందిగా ఆదేశాలు తెలియజేశారు. ఆ కారణంగా ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు దేవాలయ సిబ్బందితో కలిసి కుమారస్వామి తిప్పను పరిశీలించి శాసనసభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ముఖ్యంగా ధ్వజ స్థంభం పునర్నిర్మాణం, విమాన గోపురం మరమ్మతులు, కొండ చుట్టూ విపరీతంగా పెరిగి ఉన్న ముళ్ళకంపలను కూడా పూర్తిగా తొలగించివలెనని అధికారులకు ఆదేశించారు. వెంటనే ఆలయ ప్రధాన అర్చకులు తో చర్చించి బాలాలయం కు ఏర్పాట్లు చేసుకొని, రాబోయే ఆడి కృతిక ఉత్సవాల లోగ దేవాలయమునకు కుంభాభిషేకం కూడా చేస్తామని తెలియజేశారు. తదుపరి శాసనసభ్యులు వారు ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ ప్రకారము కుమారస్వామి తిప్పను అతినూతనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పసల సుమతి, మున్నా రాయల్, లక్ష్మీపతిలతో పాటు ఆలయ అధికారులు ధనపాల్, స్తపతి కుమార్, మహేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment