శ్రీకాళహస్తి రామాలయం వెండి శఠగోపం విరాళం
శ్రీకాళహస్తి రామాలయం కు వెండి శఠగోపం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమక్షంలో అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయం కు శ్రీకాళహస్తి వాసులు వెండి శఠగోపం విరాళంగా అందజేశారు. పట్టణంలోని జెట్టిపాలెం కు చెందిన P.కుసుమ P.నాగేశ్వరావు దంపతులు 420 గ్రాముల వెండి తో సుమారు 20,000 రూపాయలు వెచ్చించి వెండి శఠగోపం తయారు చేయించి బుధ వారం శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసు సమక్షంలో ఆలయ అర్చకులు కు అందజేశారు. దాతలను ఆలయ చైర్మన్ అభినందించి సత్కరించి తీర్థప్రసాదాలు బహుకరించారు.
ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ వాసులు తమతమ జన్మదినాలు, శుభకార్యాలకు ధనం వృధా చేయకుండా ఆలయంలోని గోశాల లేదా అన్న దానాలకు మరియు అనుబంధ ఆలయాల అభివృద్ధికి భూరి విరాళం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు తో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కంట ఉదయ్, చిట్టి. నరసింహులు, రాధాకృష్ణ, పాల్గొన్నారు.
No comments:
Post a Comment