విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని అందించిన పిళ్ళారి ఫౌండేషన్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ రోజు సోమవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో భాస్కర్ పేటలోని జెట్ పి హై స్కూల్ మరియు కెవిబి పురం లోని
జెట్ పి ఉన్నత పాఠశాల నందు మరియు శనివారం కెవిబి పురం మండలం లోని రాగిగుంట, ఆరె,సదాశివపురం గ్రామంలో పిళ్ళారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 క్లాస్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి( పరీక్ష ప్యాడ్, పెన్, పెన్సిల్,ఎరైసర్.... మొదలైనవి) అందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిళ్ళారి ఫౌండేషన్ అధినేత పిళ్ళారి అమరావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పిళ్ళారి అమరావతి మాట్లాడుతూ..... కీ.శే. పిళ్ళారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం మరియు ఆయన ఆశయాల మేరకు మన మండలంలోని ప్రతి ప్రభుత్వ స్కూల్ నందు 10వ క్లాస్ పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, అలాగే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని తెలిపారు
No comments:
Post a Comment