ఆలయ పవిత్రతను కాపాడుకుందాం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
శ్రీకాళహస్తీశ్వర ఆలయం పవిత్రతను కాపాడుకునే బాధ్యత శ్రీకాళహస్తి వాసులు అందరిపై ఉందని, ఈ క్షేత్రం ఔన్నత్యాన్ని మరింత పెంచే విధంగా కృషి చేద్దామని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయ చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి వచ్చిన సందర్భంగా క్యూలైన్లు నాలుగు గంటల పాటు ఆపివేశారు అంటూ కొన్ని ఛానల్ ఇచ్చిన వార్త అసంబద్ధం అని, అసత్య ప్రచారమని ఖండించారు. క్యూలైన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12: 24 నిమిషాల వరకు మాత్రమే నిలిపి వేయడం జరిగిందని, అయితే దేవాదాయ శాఖ మంత్రి క్యూ లైన్ వద్దకు రాగానే భక్తుల కోరిక మేరకు వెంటనే క్యూలైను రన్ చేసి ఆ తర్వాతే మంత్రి ఆలయంలోకి వెళ్లారని వివరించారు. సి సి ఫుటేజ్ లో స్పష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించే లా ఏ రోజు ఆలయ ధర్మకర్తల మండలి మరియు అధికారులు వ్యవహరించారని స్పష్టం చేశారు.
భక్తులకు ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని మంచినీళ్లు మజ్జిగ వంటి సౌకర్యం కల్పించామని, ఎక్కడ కూడా క్యూ లైన్ లో గంటల కొద్ది నిలబడి పోయే పరిస్థితి లేదని సామాన్య భక్తులకు సుదర్శన కల్పించడమే ద్యేయంగా పాలకమండలి మరియు అధికారులు ఉన్నారని స్పష్టం చేశారు.
వీఐపీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇకపై క్యూ లైన్ నిలిపివేసే విధానానికి స్వస్తి చెబుతున్నట్లు ఈ రోజు నుంచే విఐపిలను ప్రత్యేక క్యూ లైన్ ద్వారా తీసుకెళ్లి దర్శనం చేయించే విధానాన్ని చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్వామి అమ్మవార్ల అర్థం మండపంలో ఉన్న హుండీలు ను కూడా బయట ధ్వజస్తంభం సమీపంలోకి మార్చి భక్తులకు మరింత వెసులుబాటు కల్పించే విధానాన్ని కూడా తీసుకొస్తున్నట్లు, బుధవారం నుంచి హుండీ లను బయట పెడుతున్నట్లు వెల్లడించారు. అందరం కలిసి మన దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుందామని, మీడియా నిర్మాణాత్మక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు జయ శ్యామ్, మున్నా, సుమతి, సునీత నరసింహులు, రమాప్రభ పాల్గొన్నారు.
No comments:
Post a Comment