శ్రీకాళహస్తి, పానగల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో గురువారం సరస్వతీ పూజకు ముఖ్య అతిథి సత్ర వాడ ప్రవీణ్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
చిన్నతనంలోనే తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి చేస్తున్న సేవా గుణాలను అలవర్చుకున్న సంఘ సేవకులు మన "సత్ర వాడ ప్రవీణ్ " శ్రీకాళహస్తి, పానగల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో గురువారం సరస్వతీ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేసి చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అసత్య మాడరాదు" సత్యమునే పలుకవలెను" అని మహాత్మా గాంధీ గారు మనకు చెప్పిన ముఖ్య సూత్రం చిన్నతనం నుండే మీరు దీన్ని పాటించాలని తెలియజేశారు. అంతేకాదు అన్ని రంగాలలోనూ ప్రథమ స్థానాన్ని అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు
No comments:
Post a Comment