ప్రసూతి ఆస్పత్రిలో పసిపిల్లల ప్రాణాలు కాపాడండి :చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, April 21, 2022

ప్రసూతి ఆస్పత్రిలో పసిపిల్లల ప్రాణాలు కాపాడండి :చక్రాల ఉష

 ప్రసూతి ఆస్పత్రిలో పసిపిల్లల ప్రాణాలు కాపాడండి


స్వర్ణముఖి న్యూస్,గూడూరు   :

రాష్ట్ర పార్టీ ఆదేశాలననుసరించి గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ డా. పాశం సునీల్ కుమార్ గారి సహకారం తో 


తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పసిపిల్లల ప్రాణాలు కాపాడాలని తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు  పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం ముందు దివిటీలు,కొవ్వొత్తుల తో నిరసన తెలియజేసారు

రాష్ట్ర మహిళా నాయకులు     ముప్పాళ విజేత రెడ్డి, గుండల లీలావతి, భార్గవమ్మ, తుపాకుల కన్నెమ్మ..


ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులు నరక కూపాలుగా మారుతున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వసతుల లేమితో ఇక్కడ మరణాల సంఖ్య పెరిగి పోతోందన్నారు. ముఖ్యంగా తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తోందన్నారు. తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో అధికారికంగా 16మంది శిశువులు మరణించారన్నారు. అనధికారికంగా ఇంకా ఎంతమంది మృత్యువాత పడ్డారో అక్కడి అధికారులకే తెలియాలన్నారు. బిడ్డలను కోల్పోయిన త్లిదండ్రుల రోదనలు మిన్నంటినా... అధికార యంత్రాగం స్పందించక పోవడం బాధాకరమన్నారు. పైగా వాస్తవాలు కప్పి పుచ్చుతున్నారని ఆమె ఆరోపించారు. శిశుమరణాలపై అధికారులు నామమాత్రపు విచారణ జరిపి చేతులు దులుపుకోవడం బాధాకరమన్నారు. ప్రసూతి ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయో ఉన్నతాధికారులు నేటికీ పరిశీలించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.  ఈ ఆస్పత్రిలో ప్రసవాలకు కానీ... చిన్నారులను ఉంచడానికి కానీ సరైన ఆధునిక వసతులు లేవన్నారు. ఆస్పత్రి వర్గాలు ఆ సదుపాయాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థంకావడం లేదన్నారు. మౌళిక వసతుల లేమిపై చిన్నారుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మా విచారణలో తేలిందన్నారు. ప్రసూతి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సరాసరి రోజుకి ఇద్దరు చొప్పున మరణిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెల 10న వి.కోట మండలానికి చెందిన ఓ గర్భిణీ శిశువుకి జన్మనివ్వగా ఆ సమయంలో సుమారుగా 2 గంటల పాటు ఆస్పత్రిలో విద్యుత్ లేకపోవడంతో ఆ శిశువు మరణించగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇక 13న తొట్టంబేడు మండలానికి చెందిన ఓ గర్భిణీ ఆస్పత్రిలో చేరగా అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లు రిపోర్ట్ లు చూసి అంతా బాగానే ఉందని చెప్పి...15న ఉదయం 7 గంటలకు కడుపులోని శిశువు మెడకు పేగుచుట్టుకుని ఉందని ఆపరేషన్ చేయాలని గర్భిణీకి చెందిన భర్త చేత సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆపరేషన్ చేసి కడుపులోనే మరణించిన శిశువుని అప్పచెప్పడం జరిగిందన్నారు. మరొక గర్భిణీకి అంతకు ముందు కుట్లు వేయగా రోజులు గడిచినా నొప్పులు తగ్గకపోవడంతో ఆస్పత్రికి వచ్చి చూపించుకోగా ఏమిలేదని డాక్టర్లు చెప్పడం జరిగిందని.... దీంతో వీరి బంధువులు డాక్టర్లను గట్టిగా నిలదీయడంతో వేసిన కుట్లు ఊడిపోయినట్లు చెప్పి మరలా కుట్లు వేయడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా రోగులను భయపెట్టి బయటకు చెప్పనివ్వడంలేదన్నారు. ఇక శ్రీకాళహస్తి పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గతంలో మెరుగైన వైద్య సేవలు అందేవని... అయితే ఇటీవల కాలంలో ఇక్కడ వైద్యసేవలు సక్రమంగా అందడం లేదన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఎక్కువగా కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారని... అయితే ప్రన్తుతం కాన్పులు చేయకుండా ప్రతి చిన్న కేసునూ తిరుపతికి రెఫర్ చేస్తున్నారన్నారు. ఈ కారణంగా పలు ఇబ్బందులు ఎదురువుతున్నాయని తెలిపారు. ప్రసూతి ఆస్పత్రికి రెఫర్ చేసిన కేసుల్లో ఎక్కువ శిశు మరణాలు సంభివిస్తున్నాయని చెప్పారు. కాన్పులను తిరుపతికి పంపకుండా ఇక్కడే చేసే విధంగా మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమం లో  పార్లమెంట్ మహిళలు గుండాల భారతి,శ్రీపతి నరసమ్మ,నియోజకవర్గ మహిళలు తాళ్ళ సుబ్బమ్మ, సరస్వతమ్మ, పర్వీన్, సుమతి,దుర్గమ్మ,గోవిందమ్మ మాదవి, శ్యామల, మౌనిక, విజయమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad