గెరికి పూజ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ముత్యాలమ్మ ఆలయం లో జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో పెద్దిరాజు జాతర పూజలో పాల్గొన్నారు.
శ్రీ ముత్యాల అమ్మవారికి విశేష అభిషేకాలు చేసి అలంకారాలు చేశారు. అమ్మవారికి విశేషపూజలు అనంతరం భక్తులకు అంబలి ప్రసాదం ను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో పెద్దిరాజు లు పంపిణీ చేశారు. తదనంతరం యాదవ కులస్తులు శ్రీ ముత్యాలమ్మ శ్రీ రేణుకమ్మ ప్రతి రూపం ఉత్సవమూర్తుల ను పోతురాజు లు తీసుకొని గేరి క ఉత్సవం ప్రారంభించారు. పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ పట్టణంలోని శక్తి ఆలయాల నుంచి పురవీధుల మీదుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ దేవత ముత్యాలమ్మ జాతరతో సంతృప్తి చెంది, శ్రీకాళహస్తి పట్టణం శాంతితో వర్ధిల్లాలని అందరూ సుఖసంతోషాలతో ఉండేవిధంగా అమ్మ వారి ఆశీస్సులు లభించాలని జాతర వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ అధికారులు మల్లికార్జున్, లోకేష్ రెడ్డి, లక్ష్మయ్య, సుదర్శన్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment