హైకోర్టు చీఫ్ జస్టిస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శన నిమిత్తం విచ్చేసినారు. మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరి ప్రసాద్ సీనియర్ న్యాయవాదులు ఉదయ్ నాధ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ రాజేశ్వరరావు మరియు న్యాయవాదులు ముని ప్రసాద్, సుబ్రహ్మణ్యం,మీర్జావలి.. మొదలైన వాళ్ళు కలిశారు. శ్రీకాళహస్తిలో జిల్లా కోర్ట్ అనుమతికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే త్వరితగతిన జిల్లా కోర్ట్ ప్రారంభించడానికి అనుమతివ్వాలని కోరారు.
అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ.... గౌరవ హైకోర్టు సిజె గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు అలాగే కొత్త భవనము పరిశీలించి విజయవాడ రండి, పరిశీలించి , అందరి సహకారంతో అనుమతి ఇస్తామని చెప్పారు . దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు
No comments:
Post a Comment