బాగా చదువు కోనీ ఉన్నత స్థాయిలో ఎదగాలని , అలాగే అనేక ప్రభుత్వ విద్య పథకాలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్. వీరికి ఆత్మీయ స్వాగతం పలికిన పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ శోభవిత, వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మరియు తల్లిదండ్రుల కమిటీ ప్రెసిడెంట్ బతెయ్య మరియు కమిటీ సభ్యులు, సిబ్బంది మరియు విద్యార్థులు.
అనంతరం భోజనశాల మరియు పాఠశాల పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. విద్యార్థులు బాగుబోగులను అడిగి తెలుసుకున్నారు.
శంకర్ నాయక్ మాట్లాడుతూ.... గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు అనుగుణంగా విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుంది దీనిని ఉపయోగించుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఇంతకు ముందున్న గిరిజన పాఠశాలలు చాలా అధ్వానంగా ఉండేదని, కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత పాఠశాలలు అన్ని సుందరాతి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత, అలాగే అధ్యాపకులు విద్యార్ధులకు స్నేహభావంతో విద్యను అందించడం చాలా సంతోషంగా ఉందనిన్నారు
No comments:
Post a Comment