తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే
కంసమామ జగన్ రెడ్డీ ఇంకా ఎంత మంది చావాలి
వైద్యశాఖ మంత్రి విడదలరజని చిడతలు వాయించే శ్రద్ధ నీ శాఖ మీద చూపించు
డాక్టర్ అని చెప్పుకునే తిరుపతి MP గురుమూర్తి తిరుపతి ప్రసూతి హాస్పిటల్ లో జరిగే వివరాలు కనుక్కో అంటూ
శిశుశాఖమంత్రి ఉషశ్రీ చరణ్ ప్రమాణస్వీకారం రోజే చిన్నారిని బలి చేసావు, ప్రపంచాన్ని చూడక ముందే ప్రభుత్వ వైద్యశాలలో శిశువులు బలవుతున్నారు కనిపిస్తోందా అంటూ
తిరుపతిపార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షులు చక్రాల ఉష ధ్వజామెత్తారు
వారంలో 14 మంది చిన్నారులు చనిపోతే వైసీపీ ప్రభుత్వం నిద్రలో ఉందా?-
ప్రతీ రోజు ఇద్దరు ముగ్గురు చిన్నారులు చనిపోతుంటే ప్రభుత్వానికి చలనం లేదా?? మేన మామ అని చెప్పుకునే కంసమామ ఇంకా ఎందరు చిన్నారుల చనిపోతే సంతోషిస్తావు ?
రుయాలో పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. గాలి మాటల సీఎం ఏం జరుగుతోందని ఆరా తీసాడా??
పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన జగన్..
నిర్లక్ష్య పాలన ఫలితమే ఈ శిశు మరణాలు - ఆ తల్లిదండ్రుల గుండె కోతకి సమాధానం ఉందా జగన్..? - శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే - మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే భాద్యత ప్రభుత్వానికి లేదా???
నీ బాదుడేబాదుడు కార్యక్రమాల్లో భాగం గా విద్యుత్ అంతరాయం వల్ల ఆపరేషన్ థియేటర్లో తల్లి బిడ్డలలు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు
ఐసీయూలో ఉండే రోగులు చనిపోతున్నారు
ఇకనన్నా ఈ మరణాలు కట్టడి చెయ్యండి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మంచిదికాదు అంటూ చక్రాల ఉష ప్రసూతీ వైద్యశాలకు వెళ్లి భాదితులను పరామర్శించారు భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో భారతి,అనిత, హేమ పాల్గొన్నారు
No comments:
Post a Comment