తిరుపతి రుయా హాస్పిటల్ లో పసిబిడ్డల ప్రాణాలను కాపాడండి
తల్లీబిడ్డలకు సరైన వైద్యంఅందివ్వండి
శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందివ్వండి అంటూ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
RDO హరిత గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పటాన్ని బహూకరించి,వినతి పత్రం సమర్పించారు
తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష సమర్పించారు వీరితో పాటు పట్టణమహిళప్రధానకార్యదర్శి దుర్గమ్మ, మాజీ కౌన్సిలర్ అనిత, సుజాత పాల్గొన్నారు
తిరుపతిలోని రుయా హాస్పటల్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారంలో ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకూ సరాసరి రోజుకి ఇద్దరు చొప్పున 16 మంది నవజాత శిశువులు మరణించారు. కారణం వచ్చిన గర్భిణీలకు సకాలంలో వైద్యం అందించకపోవడమా? వసతులు లేకనా? వైద్య పరికరాలు లేకనా? వైద్యుల నిర్లక్ష్యం మా? అధికారుల అప్రమత్తతా? విద్యుత్ అంతరాయం వలన నా?
సరైన విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలంటూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ చావులను అరికట్టాలని తెలుగు మహిళల తరఫున డిమాండ్ చేశారు
No comments:
Post a Comment