బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం : రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, April 23, 2022

బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం : రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు

 తిరుపతిలో జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు  


స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి  అధ్యక్షతన నేడు తిరుపతిలోని జిల్లా పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారితో కలిసి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిగ ఉమ , జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప , జిల్లాలోని అన్ని మండలాల ఇంఛార్జీలు తదితర నాయకులు పాల్గొన్నారు.


కార్యక్రమంలో భాగంగా మండల ఇంఛార్జీలు ఆయా మండలాలకు సంబంధించిన శక్తికేంద్ర ఇంఛార్జీలు, పోలింగ్ బూత్ కమిటీల వివరాలను జిల్లా అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది.


అనంతరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మైక్రో డొనేషన్స్ వివరాలను ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడిని అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా, జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప గారికి ఇచ్చిన లక్ష్యాన్ని వారు నెరవేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు వారిని అభినందించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకొని 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యవర్గ సభ్యులకు దిశానిర్ధేశం చేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad