బోను పల్లె లో వాలంటరీ ఆత్మహత్య
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బోను పల్లె లో శాంతి అనే వాలంటరీ ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి శాంతి కొంతకాలంగా బోనుపల్లె దళితవాడలో వాలంటరీ గా పనిచేస్తుంది ఈమె ఆరేళ్లగా తరచు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది ఇదళ ఉండగా బుధవారం రాత్రి బోనుపల్లె దళితవాడలో విద్యుత్ సరఫరా లేని సమయంలో రేకుల కప్పు కు ఉరి వేసుకుంది కొద్దిసేపటి తరువాత కుటుంబ సభ్యులు గమనించి ఉరి తప్పించి కిందకు దింపారు అప్పటికే శాంతి మృతి చెందినట్లు గుర్తించారు భర్త నాగయ్య ఆరేళ్ల బాలుడు. నాలుగేళ్ల బాలిక వున్నారు ఈ ఘటనపై తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేశారు శాంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు
No comments:
Post a Comment