ప్రపంచ ధరిత్రీ (భూమి) దినోత్సవం సందర్భముగా మొక్కను నాటిన చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాస రావు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో ప్రపంచ ధరిత్రీ (భూమి) దినోత్సవం సందర్భముగా మొక్కను నాటినారు. ఈ కార్యక్రమమునకు చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాస రావు, బార్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రసాద్,న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాస రావు మాట్లాడుతూ.... ప్రపంచ ధరిత్రీ (భూమి) దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జన్మంతా మోసే నేలతల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తేర్చుకోలేం, ఒక చిన్న మొక్కని నాటి నేలమ్మా ఆయుష్ ను కాపాడుతాం అని పిలుపునిచ్చారు. కావున వారివారి పరిధిలో ఒక మొక్క నాటండి అని తెలిపారు
No comments:
Post a Comment