జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం.PDSU రాష్ట్ర కోశాధికారి ఎస్ జాకీర్ పిలుపు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలో విద్యా జ్యోతి స్కూల్ కరస్పాండెంట్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జార్జి రెడ్డి 50 వ వర్ధంతి సందర్భంగా గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు రాష్ట్ర కోశాధికారి S. జాకీర్ మాట్లాడుతూ పీ డీ ఎస్ యూ నిర్మాత , ఉస్మానియా జార్జిరెడ్డి 50 వ అమరత్వ స్మారక సభలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరపాలని పిలుపునిచ్చారు . విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలో జార్జిరెడ్డి త్యాగం చిరస్థాయిగా నిలుస్తుంది అని కొనియాడారు . ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు శక్తులు చేతుల్లో బలైన జార్జి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి బాటలు వేశాడు అన్నారు . జార్జి విరోచిత త్యాగం విద్యార్థి , యువతకు ఆదర్శప్రాయం అని కొనియాడారు . జార్జిరెడ్డి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి అమరుడు అయ్యారని కొనియాడారు . నేడు మోడీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు . జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం ఏప్రిల్ 14 నుండి 20 వ తేదీ వరకు జరుగు వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు. ఆదిల్. శశి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment