చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ
శ్రీకాళహస్తీశ్వరాలయం పరిధిలోని భక్తకన్నప్ప సదన్ ను శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి పట్టణ జయరామారావు వీధిలో ఉన్న భక్త కన్నప్ప సదన్ లో 32 రూములు ఉండగా, అందులో పది రూములను వివిధ అవసరాల పేరిట శాశ్వతంగా కేటాయించడం వెలుగు చూసింది. కేవలం భక్తులకు పది నుంచి పన్నెండు రూములు మాత్రమే ఇస్తూ ఉండడాన్ని చైర్మన్ గుర్తించారు. శ్రీకాళహస్తి ఆలయంలో తగినన్ని అతిథి గృహాలు లేక వేలాది గా వస్తున్న భక్తులు అతిథి గృహాలు లో బస వసతి లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న అతిథిగృహంలోనీ రూములు కూడా వివిధ అవసరాల పేరిట వినియోగించుకుంటూ భక్తులకు ఇవ్వక పోవడం ను చైర్మన్ తీవ్రంగా పరిగణించారు.. వెంటనే వివిధ అవసరాల కోసం కేటాయించిన రూమ్ ల ను ఖాళీ చేయించి భక్తులకు కేటాయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.
అతిథి గృహాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున రాయల్. మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment