అదనపు జిల్లా కోర్టు కొరకు స్థల పరిశీలన చేసిన చిత్తూరు జిల్లా ప్రధాన జిల్లా జడ్జి భీమారావు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కోర్ట్ ఆవరణలో చిత్తూరు జిల్లా ప్రధాన జిల్లా జడ్జి భీమారావు
అదనపు జిల్లా కోర్టు కొరకు ఆకస్మిక స్థల పరిశీలన చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాస్ రావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరు ప్రసాద్ మరియు బార్ అస్సోసియేషన్ సభ్యులు , సీనియర్ న్యాయవాదులు , న్యాయవాదులు, మునిసిపల్ కమీషనర్ బాలాజీ నాయక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా న్యాయవాదులతో సమావేశం ఏర్పాటుచేసి పరిశీలపై మాట్లాడారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, బార్ అస్సోసియేషన్ కోర్ట్ ప్రాంగణాలను పరిశీలించారు. మునిసిపల్ కమీషనర్ చుపిన కోర్ట్ మ్యాప్ ను పరిశీలించారు.
జిల్లా ప్రధాన జడ్జి భీమారావు గారు మాట్లాడుతూ..... అందరూ కలిసి మెలిసి అదనపు జిల్లా జడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. మీ అందరి సహకారంతో తప్పకుండా నేను త్వరగా పరిశీలించి అదనపు జిల్లా జడ్జి త్వరతగతిన అనుమతి కోసం కృషి చేస్తానని తెలిపారు.
No comments:
Post a Comment