తేది: 30-04-2022 లోగా చెల్లించి ప్రభుత్వము కల్పించిన 5% రాయితీని పొందవలసినదిగా పురపాలక సంఘ కమిషనరు బి. బాలాజీ నాయక్ తెలియజేశారు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణ పుర ప్రజలకు తెలియజేయడము ఏమనగా, 2022-23 మొదటి మరియు రెండవ ఆర్ధిక సంవత్సరమునకు గాను చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను, తేది: 30-04-2022 లోగా చెల్లించి ప్రభుత్వము కల్పించిన 5% రాయితీని పొందవలసినదిగా పురపాలక సంఘ కమిషనరు బి. బాలాజీ నాయక్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు 22 సచివాలయముల నందలి పన్నులు చెల్లించుటకు 22 కౌంటర్ ను ఏర్పాటు చేయడము జరిగినదని, ప్రజలు తమ వార్డు సమీపములోని సచివాలయము నందలి పన్నులు చెల్లించగలరని తెలియజేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయము నందలి పన్నులు చెల్లించుటకు ప్రత్యేకముగా కౌంటర్ ఏర్పాటు చేయడము జరిగిందని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై పన్నులను సకాలములో చెల్లించి, ప్రభుత్వము కల్పించిన 5% రాయితీని సద్వినియోగము చేసుకోని పట్టణాభివృద్ధికి సహకరించవలసినదిగా తెలియజేయడమైనది.
No comments:
Post a Comment