యువత క్రీడల్లో రాణించాలి : శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాధ్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలోని M.M.C A అకాడమి ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం నందు 50 మరియు 30 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పి విశ్వనాథ్ విచ్చేసి గెలిచిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని తద్వారా పట్టణానికే కాకూండా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. స్థానిక స్థాయి వరకు ఆగిపోకుండా జిల్లా,రాష్ట్ర స్థాయిలలో రాణించాలని ఆయన కోరారు. ప్రభుత్వం క్రీడాకారులకు తగిన సహకారం అందిస్తుందని బహుమతులతో పాటు ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించవచ్చని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి చరిత్రలోనే ఒకే రోజు 160 ఓవర్ల మ్యాచ్ జరగడం మా M.M.C.A అకాడమీ లో జరగడం చాలా ఆనందకరమని అధ్యక్షులు మురళి మరియు మోహన్ తెలిపారు.
nice
ReplyDelete