సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటే సకల సంపదలు కలిగి ఉన్నట్లే
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేడు శ్రీ కాళహస్తి పట్టణములోని స్టేప్స్ సంస్థ కార్యాలయం నందు పథక సంచాలకులు డాక్టర్ ప్రమీలమ్మ గారిచే మహిళా సిబ్బంది కి ఆరోగ్య సలహాలు మరియు సుాచనలు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యమే మహా బాగ్యం అని, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటే సకల సంపదలు కలిగి ఉన్నట్లే నని తెలిపారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజు నాలుగు లీటర్ల మంచి నీరు తీసుకోవడం, బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం, శరీరానికి తగినంత వ్యాయామం చేయడం, దురలవాట్లు నుండి దూరముగా నిలవడం, 40సంవత్సరాలు పైబడి న వారు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనవచ్చు. మహిళామనులు కుటుంబానికి వెన్నముక లాంటి వారు కావున వారు సంపూర్ణ ఆరోగ్య వంతులు గా ఉండటం ద్వారా కుటుంబం అబివృద్ది పదంలో నడిపించేందుకు క్రిషి చేయాలని తెలిపారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం ప్రజలు ఆరోగ్యమైన, సుఖసంతోషాలతో జీవనం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమేష్, గాయత్రి, బాస్కర్, రోజ, దేవేంద్ర, సురేష్, పాల్గొన్నారు
No comments:
Post a Comment