శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం నందు నిత్యావసరాల భద్రపరుచు గదిని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారు మరియు పాలకమండలి సభ్యులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్టోర్ రూమ్ లోని అన్ని విభాగాలను మెటీరియల్స్ ను విచారించగా బోర్డు సభ్యులు సాధన మున్నా రాయల్, జై శ్యామ్ రాయల్ లతో కలిసి స్టోర్ రూమ్ నందలి గల రిజిస్టర్ ను మొత్తం స్టాక్ యొక్క వివరాలను నూతన స్టాకును నమోదు వివరాలను పరిశీలించారు. దేవస్థానం వారు కొనుగోలు చేసిన వాటి యొక్క నాణ్యతను వాటి యొక్క నిల్వలను పరిమాణాలను పరిశీలన చేసి ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండాలని తెలియజేశారు. గౌరవనీయులైన శాసన సభ్యులు వారు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్వామి అమ్మవార్ల గర్భగుడి నందుగల దీపములకు కర్ణాటక ప్రభుత్వం వారిచే తయారు చేయబడిన నందిని ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలని దానికి సంబంధించిన కాంట్రాక్టు వారిని పిలిపించి కంపెనీ చైర్మన్ వారితో సంభాషించారు. దేవస్థానం నందు నిత్యవసరాలు అన్నీ నాణ్యమైనవిగా ఉండాలని, స్టోర్ రూమ్ నందు ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోరాదని దూరం అధికారులకు సిబ్బందికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు దిశానిర్థేశాలు చేశారు.ఈ ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు బుల్లెట్ జయశ్యామ్, సాధనం ఉన్న రాయల్. మరియు స్టోర్ ఇన్చార్జులు పాల్గొన్నారు
No comments:
Post a Comment