జగనన్నకు మహిళల పాలాభిషేకం
YSR సున్నా వడ్డీ 3 వ విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక పెళ్లి మండపం వద్ద మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం , మహిళలకు జాకెట్ , పసుపు, కుంకుమను, గాజులు వితరణ గా ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మిద్దెల హరి విచ్చేసి మహిళా నాయకురాలు మాధవి, ముని లక్ష్మి,విజయమ్మ, కిరణ్మయి వారిచే పాలాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించి మిద్దెల హరి మాట్లాడుతూ * అక్కా చెల్లెమ్మలు వడ్డీని చెల్లించే గొప్ప బాధ్యతను అన్నగా తమ్ముడిగా తీసుకున్న దేశంలో ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర వ్యాప్తంగా 1300 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించి మహిళ అభ్యున్నతే లక్ష్యం గా పని చేస్తున్నారని కొనియాడుతూ ఈ పథకం ద్వారా ఎక్కువగా బడుగు, బలహీన, దళిత,మైనార్టీలు లబ్ధి పొందుతున్నారని అందరూ రాబోవు ఎన్నికల్లో కూడా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతామని తెలియజేశారు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన YSRCP మాజీ పట్టణ అధ్యక్షుడు * కొట్టేడి మధు శేఖర్* మాట్లాడుతూ ఆదినుండి BC నాయకుడిగా, చేనేత కార్మికులకు, BC, SC, ST కాపు, మైనార్టీలకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ను వందలాది మందికి ఇప్పించి ఆదుకున్న నాయకుడు మిద్దెల హరి అని వారికి అందరూ అండగా నిలబడాలని ఆయనకు పార్టీ అధినాయకత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో.. మాజీ కౌన్సిలర్ జయదేవన్.గిరి, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గంగయ్య, ఎత్తి రాజులు బండి రమేష్, దావలగిరి, ఇసుక మట్ల బాలా , గంజి వెంకటేష్, ప్రభాకర్, నున్న సుధా, చల్ల సుధాకర్,మాధవి, ముని లక్ష్మి కిరణ్మయి, విజయమ్మ , వెంకటేష్,బాబు, సాయి, శివ మిద్దెల హరి యువసేన సభ్యులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు
No comments:
Post a Comment