కర్మ క్రియలు మండపమును పరిశీలించిన అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం ప్రాంగణం లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పక్కనున్న కర్మ క్రియలు మండపమును పరిశీలించిన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న వస్త్రాలను గమనించి వెంటనే శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోను చేసి తొలగించాలని సూచించారు. వెంటనే స్పందించిన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ గారు సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మేస్త్రి శ్రీకాంత్ ల సిబ్బంది వారి ద్వారా 2 ట్రాక్టర్ల వస్త్రాలను వెంటనే తొలగించి వేశారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన కమిషనర్ గారికి వారి సిబ్బందికి పాలకమండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసినారు.
No comments:
Post a Comment