చిత్తూరు జిల్లా ప్రధాన జిల్లా జడ్జి భీమారావు గారిని కలిసిన శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు చిత్తూరు జిల్లా ప్రధాన జిల్లా జడ్జి భీమారావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమమునకు శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరు ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు ఉదయ్ నాధ్,న్యాయవాదులు మునిప్రసాద్, కంఠ ఉదయ్.... మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయనున్న అదనపు జిల్లా కోర్టు కొరకు ఇప్పటివరకు జరిగిన విషయాలను వివరంగా తెలిపినారు. అనంతరం జడ్జిగారు త్వరలోనే పరిశీలిస్తానని తెలిపారు
ప్రెసిడెంట్ ప్రసాద్ మాట్లాడుతూ..... మర్యాదపూర్వకంగా జిల్లా జడ్జి ను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ప్రస్తుత స్థితిగతులను వివరించామని,అలాగే వారు సానుకూలంగా స్పందించి త్వరలో శ్రీకాళహస్తి కి వచ్చి పరిశీలిస్తానని అన్నారు
No comments:
Post a Comment