రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రతినిధులతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సేనేట్ హాల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల గొప్పగా విస్తరించేందుకు మరింతగా అభివృద్ధి చేసేందుకు తద్వారా ఉన్నత విద్యను విప్లవాత్మకంగా మార్చడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం, అలాగే పరిశోధనా రంగంలో మెరుగైన పరిశోధనల ద్వారా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అందుకోసంగా రూపొందించిన కేంద్ర ప్రాయోజిత పథకమే "రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్". (రూసా) కృషి చేస్తుందని రూసా ప్రతినిధులు చెప్పారు.
పరిశోధనా రంగం మెరుగుపరిచేందుకు లైబ్రరీలు, కంప్యూటర్ లేబొరేటరీలను నవీకరణ చేయడం, స్వయంప్రతిపత్త కళాశాలలను ప్రోత్సహించడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రపంచానికి నిష్ణాతులైన నిపుణులను అందించవచ్చని తెలిపారు.
వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ లను రూసా కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అందులో మొదటి విడతగా 51 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని రూసా కోఆర్డినేటర్ తెలియజేసారు.
ఈ సమావేశంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి జిల్లాకి అన్ని వసతులు ఉన్నాయని ఏ రంగం లో చూసిన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్బంగా సమావేశం లో పాల్గొన్న వారికి పిలుపునిచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సహకారంతో అటల్ ఇంక్యూబేషన్ సెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ లని తిరుపతిలో ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ గారు తెలియజేసారు.
ఈ సమావేశంలో ఎంపీ గురుమూర్తి గారితో కలిసి వి.సి రాజారెడ్డి , రూసా కోఆర్డినేటర్లు, ఎస్వీ యూనివర్సిటీ లోని అన్ని విభాగాల ప్రిన్సిపాల్స్, పాల్గొన్నారు.
No comments:
Post a Comment