భక్తుల అధిక రద్దీ కారణంగా కార్యనిర్వాహణాధికారి కె వి సాగర్ బాబు ఆలయ పర్యవేక్షణ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శనివారం రోజున భక్తుల అధిక రద్దీ కారణంగా శ్రీయుత కార్యనిర్వాహణాధికారి కె వి సాగర్ బాబు గారు రాహుకాల సమయంలో రాహు కేతు సర్ప దోష నివారణ చేయు మండపాలను పర్యవేక్షించారు. మండపాలలో ఎలాంటి బలవంతపు వసూళ్లు చేయకుండా, అడ్డదారిలో భక్తులను పంపకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆలయ ప్రాంగణం లోని లోపల క్యూలైన్లను, టికెట్ కౌంటర్ లను, పాతాళ గణపతి స్వామి సన్నిధి వద్ద పర్యవేక్షణ చేశారు.
ఆలయం లోపలికి క్యు ను, కంచు గడప వద్ద, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారి తో కలిసి పర్యవేక్షణ చేశారు.
ప్రసాదం పోటును పరిశీలించి అక్కడ తగు సూచనలు చేశారు. ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని సంబంధిత aeo శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రసాదం పోటు ఇన్చార్జ్ నాగభూషణం నాయక్ వారికి సూచనలు చేశారు. ఈ పర్యవేక్షణలో లో ఈ ఓ గారి తో పాటు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment