జిల్లాలోని పెండింగ్ లో ఉన్న హైకోర్టు కేసులు, కంటెంప్ట్ కేసులపై దృష్టి సారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి :
జిల్లాలోని వివిధ స్థాయిలలో పెండింగ్ లో ఉన్న హైకోర్టు కేసులు, కంటెంప్ట్ కేసులపై సత్వరమే దృష్టి సారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని RDO లను, తాసిల్దార్లను జిల్లా కలెక్టర్ కే. వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తూ క్షేత్ర స్థాయి అధికారులు కలెక్టరేట్ రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదించి సకాలంలో కౌంటర్ ఫైలింగ్ లు చేయాలని సూచించారు. తదనుగుణంగా కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయాలని తెలిపారు. రెవెన్యూ సమస్యలతో వచ్చే ఫిర్యాదు దారులకు సకాలంలో స్పందించి వారికి పరిష్కారం చూపాలి అని సూచించారు. హైకోర్టు కేసులు, కంటెంప్ట్ కేసులపై డివిజన్ ల వారీగ వివిధ స్టేజ్ లలో ఉన్న కేసుల పురోగతిపై సమీక్ష చేసి దిశా నిర్దేశం చేశారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment