*నవసంధు వినాయక దేవాలయం జీర్ణోద్ధారణ...త్వరితగతిన కుంభాభిషేకం : చైర్మన్ అంజూరు శ్రీనివాసులు*
శ్రీకాళహస్తి పట్టణం, నాలుగు మాడ వీధుల్లో కొలువుతీరి ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం అనుబంధాలయాలైన నవ సందు గణపతి దేవాలయాలలో ఆగ్నేయంగా బేరివారి మండపం వద్ద వెలసివున్న శ్రీ సర్వ మంగళ వినాయక స్వామి వారి విగ్రహాన్ని కొందరు స్వప్రయోజనాల కోసం గతంలో ఉన్న దిక్కును మార్చి వేయడం జరిగినది. ఈ విషయం ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయము ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు శ్రీనివాసులు గారి దృష్టికి తీసుకొని రాగా ఈ దినం చైర్మన్ గారు ఆలయ సిబ్బందితో కలిసి దేవాలయాన్ని పరిశీలించారు. వెంటనే ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి స్వామి వారిని యథాస్థితి లో ఉంచి కుంభాభిషేకం నిర్వహించాలని అధికారులకు తెలియజేశారు. నాలుగు మాడ వీధుల్లోని నవసంధు దేవాలయాలన్నీ నిత్యం ధూపదీప నైవేద్యాలతో గణపతి దేవుళ్ళకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని భక్తులకు, పట్టణ ప్రజలకు తీర్థప్రసాదాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారితో ఆలయ అధికారులు ధనపాల్, స్తపతి కుమార్, కిషోర్ లతో పాటూ ఎక్స్ కౌన్సిలర్ శరవణ, సూరావారి సురేష్, అడ్వకేట్ లక్ష్మీపతి, బాల గౌడ్, ధన, కళ్యాణ్, హరి తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment