బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంచార్జి శ్రీ కోలా ఆనందకుమారగారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అంబరాన్నoటిన భారతీయ జనతా పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
నేడు "భాజాపా 42వ ఆవిర్భావ దినోత్సవం" సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణం లోని, భేరివారి మండపం వద్ద భాజాపా రాష్ట్ర నాయకులు శ్రీ కోలా ఆనందకుమార గారు,పార్టీ జెండా ఆవిష్కరించి, భాజపా శ్రేణులకు, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం!!
శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన "భారీ ర్యాలీ" కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణ పురవీదుల్లో జరిగిన ఈ "ర్యాలీ" నందు నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు...
ఈ సందర్బంగా కోలా ఆనందకుమార మాట్లాడుతూ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై... పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ
మానవతావాదానికి కట్టుబడి. పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ ఆచరిస్తూ...
అటల్ జీ , అద్వానీ జీ తదితర అగ్రనేతల మార్గదర్శనంలో..
శ్రీ జే.పి.నడ్డా గారి నాయకత్వంలో ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించి...
ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భరతమాతను విశ్వ గురువుగా నిలిపే యజ్ఞంలో భాగమైన
బీజేపీ కార్యకర్తలకు,అభిమానులకు
భారతీయ జనతా పార్టీ
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...
పై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ కోలా ఆనంద కుమార గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
No comments:
Post a Comment