శ్రీకాళహస్తి కొత్తపేట ప్రాధమికోన్నత పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి196వ జయంతి వేడుకలు ఘనంగా చేశారు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రధానోపాధ్యాయుల వారు ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థుల నడుమ జ్యోతిరావు పూలే గారికి ఘనమైన నివాళులు అర్పించారు ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరెడ్డి గారికి ఉపాధ్యాయులు గజేంద్ర గారికి సన్మానం చేసి సత్కరించారు
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే గారు మహా రాష్ట్రాలో జన్మించి
బడుగు బలహీన
అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా స్త్రీ విద్యకోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని , సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు అసమానతలు తొలగించడానికి ఎంతో కృషి చేశారు ఈ సమాజంలో అసమానతలు పోవాలంటే విద్య విజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి విద్యా వ్యాప్తి కోసం పాటుపడ్డారు సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగిస్తూ ముందుకు వెళ్లారు సమసమాజ స్థాపనే ధ్యేయం అని నమ్మి వారితో పాటు వారి సతీమణిని కూడా సమాజ శ్రేయస్సు కోసం వారు వెనుకుండి ఆమె ని ముందుకు నడిపిన మహోన్నతమైన వ్యక్తి,ఆమెని చిన్న వయసులో పెళ్లాడినా విద్యాబుద్దులు నేర్పి సమాజంలో మహిళలందరు కూడా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో వారి సతీమణిని మొట్టమొదటి ఉపాధ్యాయినిని చేసి వారిచే అందరికి చదువును పంచిన మార్గదర్శి
మనిషిని మహోన్నతుడిగా తీర్చి దిద్దేది విద్య ఒక్కటే అని, అందరికి విద్యనందేలా కృషి చేసిన మహనీయుడు, తత్వవేత్త సంఘ సంస్కర్త అని అన్నారు.
జ్యోతిరావు పూలే గారి జీవితం ఈ దేశ ప్రజలకు ఆదర్శం వారి ఆశయాన్ని మనమందరు ముందుకు తీసుకుపోవడమే వారికిచ్చే గణమైన నివాళి అన్నారు
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం భారతి హేమలత విజయ జయలక్ష్మి షాకిరా హేమ జ్ఞానేష్ రాయల్ పాల్గొన్నారు
No comments:
Post a Comment