ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం,నారద పుష్కరిణి వద్ద అత్యాధునిక పరికరాలతో కొండుగారి శ్రీరామమూర్తి గారి కుటుంబ సభ్యులు నూతన ఎలైట్ స్కాన్స్ (స్కానింగ్ సెంటర్ ను) ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు పాల్గొని రిబ్బన్ కట్ చేసి స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారు.
అనంతరం స్కానింగ్ సెంటర్ ను పరిశీలించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొండుగారి కుటుంబ సభ్యులు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటున్నాను అన్నారు. మంచి సెంటర్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించడం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెంచు రెడ్డి,పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు,గుమ్మడి బాలకృష్ణయ్య,పగడాల రాజు, గురు దశరతన్,సురేష్,శరవణ,రాము, బోర్డు సభ్యులు మున్నా, జయశ్యామ్, నందా,లీలా,పెరుమాళ్,కృష్ణా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment