రాజీ మార్గం రాజా మార్గం : ఐ. కరుణ కుమార్ ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి . - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, April 23, 2022

రాజీ మార్గం రాజా మార్గం : ఐ. కరుణ కుమార్ ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి .

 రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని మరియు రాబోయే జూన్ 26వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని తెలియచేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఐ. కరుణ కుమార్ 




స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్తూర్ జిల్లా  న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి  ఐ. కరుణ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి మరియు  శ్రీకాళహస్తి  కోర్ట్ పరిధిలో శ్రీకాళహస్తి అర్బన్ మరియు రురల్,తొట్టంబేడు, కెవిబి పురం,ఏర్పేడు,బిఎన్ కండ్రిగ మండల అన్ని శాఖలు ( రెవిన్యూ, పోలీస్, మునిసిపల్,ఎంపిడిఓ, సీడీపీఓ,ట్రాన్స్పోర్ట్, ఫైర్,ఫారెస్ట్, లబర్, అన్ని బ్యాంక్ లు) ఉన్నతాధికారులు,కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ.. మొదలినవాలు పాల్గొన్నారు.


ముందుగా కోర్టు ఆవరణలో చెట్టు నాటే కార్యక్రమం జరిగింది. అనంతరం అంగన్వాడీ, మహిళా పోలీస్లు, చేతి వృత్తి పనులు, లబర్ ఈ-శ్రమ కార్డ్ స్టాల్ ను ప్రారంభించి, వాటి పని తీరును న్యాయమూర్తిలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అసంఘటిత కార్మికులకు లబర్ ఈ-శ్రమ కార్డ్ అందించారు.


జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.....  గౌ : సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాబోయే జూన్ 26వ తేదీన జరుగు జాతీయ లోకఅదాలత్ విజయవంతం చేయాలని కోరారు.అలాగే  మే నెల 14వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 26వ తేదీ కి మార్చడం జరిగిందని తెలిపారు. జూన్ 26 న  నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్ష దారులు, న్యాయవాదులు, ప్రజల సహకరించి విజయవంతం చేయాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad