శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తమిళనాడు ధర్మపురం అధీనం మఠం పీఠాధిపతి శ్రీ-ల-శ్రీ కయిలై మసిలమని దేసిగా జ్ఞానసంబంధ పరమాచార్య స్వామి వారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు, ఈ.ఓ సాగర్ గారు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువా కప్పి చిత్రపటాన్ని మరియు స్వామివారి ప్రతిమను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు మరియు పట్టణం వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment