గణపతి హోమం ఆర్జిత సేవా
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మరో ఆర్జిత సేవా తీసుకురావడానికి శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్త మండలి సంకల్పించింది. సంకట చతుర్దశి రోజున గణపతి హోమం ను ఆర్జిత సేవ గా తీసుకురానున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. సంకట చతుర్దశి రోజున శ్రీకాళహస్తి ఆలయంలోని అంజి అంజి వినాయకుడి వద్ద గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ గణపతి హోమం లో భక్తులు ను కూడా భాగస్వామ్యం చేసి గణపతి హోమం నిర్వహించిన భాగ్యం కల్పించాలని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు నిర్ణయించారు.
భక్తులు గణపతి హోమం నిర్వహించాలంటే ప్రస్తుత రోజుల్లో వేల రూపాయలు వెచ్చించాల్సి ఉందని, సామాన్య భక్తులు సంకట చతుర్దశి రోజున గణపతి హోమం చేయిస్తే మంచిది అని భావిస్తూ ఉంటారని అలాంటి భక్తులకోసం గణపతి హోమం నిర్వహించుకునేలా గణపతి హోమం ను ఆర్జిత సేవ గా తీసుకురావడానికి తమ ధర్మకర్తల మండలి
సంకల్పిస్తున్నట్లు తెలిపారు. 300 రూపాయల టికెట్ తో గణపతి హోమము ఆర్జిత సేవ గా నిర్వహించాలని, ఈ మేరకు ఆలయ ఈవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ అనుమతులు తీసుకుని వచ్చే సంకట చతుర్దశి నాడు ఆర్టిసి సేవ ను ప్రారంభిస్తామన్నారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి సంకట చతుర్దశి రోజున విశిష్టమైన గణపతి హోమం చేయించుకునే అవకాశం భక్తులు కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు.
సంకట చతుర్దశి హోమం:
శ్రీకాళహస్తి ఆలయంలో అంజి అంజి వినాయకుడి వద్ద సంకట చతుర్దశి నీ పురస్కరించుకొని గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు హోమ పూజలో పాల్గొని పూజలు నిర్వహించుకున్నారు. హోమం పూజల అనంతరం గణపతికి విశేష పూజలు జరిపారు. పూజల అనంతరం వేద పండితులు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ను ఆశీర్వదించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు సుమతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment