మానవసేవే మాధవసేవ ఎస్ ఎస్ ఆర్ : చలివేంద్రం ప్రారంభం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :మానవసేవే మాధవసేవ అని నీరు ప్రాణాధారం తో సమానం అని సేవా కార్యక్రమాలు చేయడం లో తాను ఎప్పుడు ముందు ఉంటానని చిత్తూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అధ్యక్షులు సామాను శ్రీధర్ రెడ్డి (ఎస్ ఎస్ ఆర్) అన్నారు. బుధవారం పట్టణంలోని వెంకటగిరి బస్ స్టాండ్ జడ్పీ హైస్కూల్ సమీపంలో ఎస్ ఎస్ ఆర్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మొదటిరోజు శీతలపానీయాలు, మజ్జిగ, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ ఆర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజల దాహార్తి తీర్చేలా ఎస్ ఎస్ ఆర్ యువత ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని గ్రామీణ ప్రాంతాల నుండి శ్రీకాళహస్తి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్నా వారికి ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు, అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే యాత్రికులకు ఎండ వేడిమి నుండి దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఎంతగానో ఉపయోగపడుతుందని నీరు ప్రాణ దారంతో సమానమని రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంలో యువత చొరవ చూపి ముందుకు రావాలని చిన్న వయసు నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలని కోరారు. అదేవిధంగా ఈ ఏడాది ఎండాకాలం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉందని వృద్ధులు, చిన్నపిల్లలు ,విద్యార్థులూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సామాను శ్రీధర్ రెడ్డి కి ఎస్ ఎస్ ఆర్ యువత, ఎస్ ఎస్ ఆర్ అభిమానులు, ఘన స్వాగతం పలికి శాలువాతో భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎస్ ఎస్ ఆర్ యువత, ఆటో కార్మికులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment