అడిషనల్ డిస్టిక్ కోర్టు కొరకు శ్రీకాళహస్తి న్యాయమూర్తుల పరిశీలించారు, మరియు జూన్ 26 జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని న్యాయ సముదాయంలో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటుకొరకు న్యాయమూర్తులు పరిశీలించారు. అనంతరం బార్ అస్సోసియేషన్ గదిలో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో తిరుపతి సీనియర్ సివిల్ జడ్జి మరియు శ్రీకాళహస్తి ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి, బార్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రసాద్, న్యాయవాదులు ప్రభాకర్ రెడ్డి, కుమార్, రాజేశ్వర రావు...మొదలైనవాలు పాల్గొన్నారు .
న్యాయమూర్తులు, న్యాయవాదులు శ్రీకాళహస్తి లోని భవనాలను పరిశీలన చేశారు.. మొదటి అంతస్తులో జిల్లా అడిషనల్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన మేరకు తీసుకుని చేర్పులు మార్పులు చేయాలని ఆర్అండ్బి శాఖ అధికారులను కోరారు.. తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతోపాటు శ్రీకాళహస్తి లోనూ జిల్లా అడిషనల్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.
న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ...... జూన్ 26వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ విజయవంతం చేసే విధంగా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసుల నుంచి ఉపశమనం పొందాలన్నా రు. బార్ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏర్పాటుకు న్యాయమూర్తుల పరిశీలన చేశారని త్వరలోనే డిస్ట్రిక్ట్ కోర్టు కార్యకలాపాలను ప్రారంభించే విధంగా భవనం సిద్ధం చేసే విధంగా సూచనలు చేశారన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని తెలిపారు.
ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు,
ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో సుమారు 2రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138,
బ్యాంక్ రికవరీ కేసు, Mact కేసు, మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్,
ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, other సివిల్ కేసు, రెవెన్యూ కేసు, కాంపౌండ్ ఎక్సైజ్ కేసు,
ఫ్రీ లిటిగేషన్ కేసు లు.... మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు
No comments:
Post a Comment