అడగంగానే కాదనకుండా శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన మన జగనన్నకు శ్రీకాళహస్తి ప్రజల తరఫున హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,త్వరలో కలెక్టరేట్ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి రానుంది - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
◆నా వెనుక శ్రీకాళహస్తీశ్వరుడు జగనన్న ఉన్నారు,వారి ఆశీర్వాదాలతో శ్రీకాళహస్తిని ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేయని విధంగా చేసి చూపిస్తాను.
◆30 సంవత్సరాల గత పాలకులు సాధించలేనిది శ్రీకాళహస్తి ప్రజలందరి ఆశీర్వాదాలతో "రెవెన్యూ డివిజన్" ను సాధించడం చాలా ఆనందంగా ఉంది.
◆ఎంపీ గురుమూర్తి గారు నేను రామలక్ష్మణ లాగా శ్రీకాళహస్తి ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తాము.
◆నేను అడగంగానే జీవోను సైతం రద్దు చేసి నా విన్నపానికి విలువ ఇచ్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను.
◆నా బిడ్డలు శ్రీకాళహస్తి నియోజకవర్గ సేవకులకు, అధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం నా ఇద్దరు పిల్లలను తయారు చేస్తున్నాను.
◆నాకు అవకాశం ఇచ్చారు మూడేళ్లలో నేను ఏమి చేశానో మీ ముందు ఉంచుతాను, గత పాలకుల 30 సంవత్సరాలలో సాధించలేనిది మూడేళ్లలో నేను సాధించింది త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్న.
◆శ్రీకాళహస్తి ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని వారు అవకాశం ఇచ్చినంత కాలం వారికి సేవ చేస్తాను.
◆రాష్ట్రంలో శ్రీకాళహస్తి లో జరిగిన అభివృద్ధి మరే నియోజకవర్గాల్లో జరగలేదు. శ్రీకాళహస్తిని నా బిడ్డ లాగా చూసుకుంటా.
శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు నూతన RDO కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, MP మద్దెల గురుమూర్తి గారు మరియు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ హరితా గారు ప్రారంభించారు.
ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పలు మండలాల నుండి విచ్చేసిన మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు.అలాగె మహిళలు నృత్యం చేస్తూ శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ విగ్రహం దగ్గర నుండి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టన నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ముఖ్య నాయకులు SCV దిలీప్,గుమ్మడి బాలకృష్ణయ్య,పగడాల రాజు, వయ్యల కృష్ణారెడ్డి,బోర్డు సభ్యులు సుమతమ్మ, మున్నా,జయశ్యామ్, పంతులు మరియు లీలా,నందా,కోవి చంద్రయ్య నాయుడు,కే.హారినాయుడు,కృష్ణ, సిరాజ్,ఫజల్, శేఖర్,మురళి యాదవ్, పులి రామచంద్ర,గణేష్, రమేష్, సునీతసింగ్,షర్మిలా ఠాగూర్,ఋష్యేంద్రమణి,ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి కి రెవిన్యూ డివిజన్ రావడంపై సంతోషం వ్యక్తపరుస్తూ పలువురు వక్తలు మాట్లాడారు వారిలో లోకేష్ యాదవ్,సుమతి, చందమామల కోటయ్య,అత్తూరు హరి,పురుషోత్తం గౌడ్,సుబ్బారెడ్డి, బత్తి శెట్టి,భక్తవత్సలం మరియు అధికారులు దేవస్థానం ఈవో పెద్దిరాజు,తాసిల్దార్ జరీనా,శివ, సంతోష్ తదితరులు మాట్లాడారు.
అలాగే తిరుపతి రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి రెవెన్యూ డివిజన్ శ్రీకాళహస్తి తీసుకొచ్చేందుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఆర్డీవో హరిత గారిని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సన్మానించి శ్రీకాళహస్తీశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
No comments:
Post a Comment