*చంద్రబాబుకు ముక్కంటి తిరుపతి వెంకన్న తీర్థప్రసాదాలు*
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
అలుపెరగని పోరాటయోధుడు,నవ్యాంధ్ర నిర్మాత, యువత భవిష్యత్,మహిళా పక్షపాతి, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని ప్రజలబాగు కోసం పరితపించే మహోన్నతమైన , అపర భగీరథుడు విజనరీ లీడర్, డ్వాక్రా సంఘాల సృష్టికర్త , గౌరవ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు బుధవారం తిరుపతి పార్లమెంటటు తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి శాలువాతో సత్కరించి హరిహరుల తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రబాబునాయుడు జన్మదినం పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన్ను కలసి చక్రాల ఉష శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. అనంతరం ముక్కంటి శేషవస్త్రంతో సన్మానించి... హరిహరుల ప్రసాదాలు అందజేశారు.
No comments:
Post a Comment