శ్రీవారి కల్యాణోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టిటిడి ఛైర్మన్
చెన్నైలోని ఐల్యాండ్ మైదానంలో ఏప్రిల్ 16వ తేదీన జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్‌ను మంగళవారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆహ్వానపత్రిక అందించారు. అనంతరం ఐల్యాండ్ మైదానంలో జరుగుతున్న కల్యాణం ఏర్పాట్లను ఛైర్మన్ పరిశీలించారు.
No comments:
Post a Comment