గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన పాఠశాల ప్రాంగణం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు టీటీడీ ధర్మ పరిషత్ వారి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులతో సరస్వతి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా టీటీడీ ధర్మ పరిషత్ జిల్లా మెంబెర్ పోతుగుంట రాజ్ కుమార్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి విద్యార్థులతో పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి దేవి విగ్రహంనకు పాలాభిషేకం చేసి వివిధ పూలతో అలంకరణలు చేసి విద్యార్థుల చేతులమీదుగా సరస్వతి పూజలు చేసినారు. అనంతరం సరస్వతి దేవిని దర్శనం చేసుకున్న విద్యార్థులందరికీ తీర్థప్రసాదాలు అందించారు. టీటీడీ ధర్మ పరిషత్ తరపున విద్యార్థుల గోవిందనామ స్మరణ చేసి, విద్యార్థుల చేతులకు గోవింద కంకణాలు అధ్యాపకులు చేతులమీదుగా కట్టి విద్యార్థులను ఆశీర్వదించారు.
అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.... రాబోయే పదో క్లాసు పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని సరస్వతీదేవిని కోరుకుంటున్నామని చెప్పారు. అనంతరం పదో తరగతి అయిన తర్వాత ఉన్నత విద్యలో మంచి స్థాయిలో రాణించాలని విద్యార్థులను ఆశీర్వదించారు.
No comments:
Post a Comment