ఆంధ్ర రాష్ట్ర అక్కాచెల్లెమ్మలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న లక్ష్యం - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలంలో గౌ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన "YSR సున్నా వడ్డీ" పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
మూడో విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలంలో ఏర్పాటు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు చెక్కును అందజేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ఓట్లు దండుకున్న చంద్రబాబు మోసం గురించి పాదయాత్రలో అడుగడుగునా విన్న జగనన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు సున్నావడ్డీ పథకం ద్వారా ఆ హామీని నెరవేరుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు అవ్వాలనే గొప్ప ఆలోచనతో సున్నా వడ్డీకే రుణాలు పథకానికి నాంది పలికిన జగనన్న చరిత్రలో నిలిచిపోతారు.ఇంత పెద్ద మొత్తం వడ్డీ నిధులు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని ఆడపడుచుల బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు వడ్డీ మినహాయింపు ఉంటుందని అన్నారు.అలాగే టిడిపి హయాంలో 2017-18 సంవత్సరానికి 1134 కోట్ల రూపాయలు, 2018-19 సంవత్సరానికి 1327 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఒక్క రూపాయి కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇవ్వలేదని , నేడు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రూపాయితో సహా చెల్లిస్తుందని పేర్కొన్నారు. జగనన్న పరిపాలన లో మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు.
అనంతరం మహిళలందరూ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థాయిలో (ఏర్పేడు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ మెప్మా, తొట్టం బేడు, శ్రీకాళహస్తి మండలం, రేణిగుంట),ఏర్పేడు ఎంపీడీఓ కార్యాలయం నందు గౌరవ mla గారు, mp గురుమూర్తి గారు , మెప్మా పీడీ రాధామ్మ గారు ఎంపీడీఓ లు, మునిసిపల్ కమీషనర్ మెప్మా మరియు సెర్ప్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మూడో విడత సున్నావడ్డి పంపిణి కార్యక్రమం నియోజకవర్గం స్థాయిలో ఏర్పేడు నందు నిర్వహించడం జరిగింది మూడవ విడత సూన్న వడ్డీ మండలం వారీగా శ్రీకాళహస్తి మండలం 1369 సంఘాలకు -2.74 లక్షలు
శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1211 సంఘాలకు మెప్మా 1.66 లక్షలు
ఎర్పేడు మండలం 1319 సంఘాలకు 2.69 లక్ష లు
రేణిగుంట మండలం 1346 సంఘాలకు -2.53 లక్ష లు
తోట్టo బేడు 1314 సంఘాలకు 2.60 లక్షలు మూడవ విడత నియోజకవర్గం స్థాయి మొత్తం 6259 సంఘాలకు గాను
మొత్తం రూపాయలు సున్నావడ్డి 11.31 పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈరోజు mla గారు మెగా చెక్ డ్వాక్రా సంఘ లీడర్లు కు మెగా అందచేయడం జరిగింది ఇప్పటి వారు మూడు విడతలు కలిపి నియోజకవర్గం స్థాయిలో ఇప్పటి వరకు 17951 సంఘాలకు 33.80 ముప్పై మూడుకోట్ల ఎనబై లక్ష ల రూపాయలు డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరడం జరిగింది mla గారు సంఘ సభ్యులకు మాత్రమే జగనన్న ఆసరా, సున్నావడ్డి ఇస్తున్నాడు అన్ని పథకాలు మహిళలకు ఇస్తున్నారు కావున మహిళలు అందరు బాగా జీవనోపాదులు పెంచుకొని ఆర్ధికముగా ఎదగాలని mla గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడాడు, mp గారు అన్ని వెల్ఫేర్ పథకాలు అమ్మఒడి, ఆసరా, వైస్సార్ సున్నావడ్డి,వైస్సార్ చేయూత, అన్ని పథకాలు ఉపయోగించుకొని డ్వాక్రా మహిళలు బాగా రానించాలని కోరినారు ఈ కార్యక్రమం నందు మెప్మా పీడీ గారు రాధమ్మ గారు, velugu సిబ్బంది డాంగేయాదవ్, drda జిల్లా స్థాయి అధికారులు వెలుగు సిబ్బంది, మెప్మా సిబ్బంది ప్రసాద్ cmm, మెప్మా రిసోర్స్ పర్సన్స్ సంఘ మిత్రలు, నాలుగు మండల వెలుగు Apmo లు, నియోజకవర్గం స్థాయి వైస్సార్ పార్టీ నాయకులు, శ్రీకాళహస్తి పట్టణ వైస్సార్ పార్టీ నాయకులు, నాలుగు మండలాల సర్పంచులు, జడ్పీటీసీ మెంబెట్స్, నాయకులు పాల్గున్నారు
No comments:
Post a Comment