దేవాదాయ శాఖ మంత్రి దర్శనం
శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. భక్తులకు సుదర్శనం కల్పించడమే దేవాదాయ శాఖ మంత్రిగా తన ధ్యేయమని,
శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ కు సీఎం ఆమోదంతో చేసెలా చేస్తామన్నారు. ఆలయాల్లో వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అంజూరు ఘనస్వాగతం:
శ్రీకాళహస్తి ఆలయానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విచ్చేశారు. ఆలయం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వైకాపా నాయకురాలు పవిత్ర రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు ఆకాష్ రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు పాలకమండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎమ్మెల్యే కుమార్తె పవిత్ర రెడ్డి కలంకారీ వస్త్రాలు, దేవత ప్రతిమలను బహూకరించారు.
దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అనంతరం వేసవి సెలవులు కూడా రావడంతో అన్ని ఆలయాలకు రద్దీ పెరిగింది అన్నారు. రద్దీని తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు ఇస్తున్నామన్నారు.. ప్రతి భక్తుడికి సుదర్శనం కల్పించడమే తన ధ్యేయమన్నారు. శ్రీ కాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ చక్కగా ఉందని అధికారులతో చర్చించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తీసుకుని వెంటనే అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో క్యాడర్ తక్కువగా ఉండడం పై డెప్యుటేషన్ నియమించడం లేదా తగు చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల్లో ఆన్లైన్ సిస్టం లో మంచి చెడు రెండూ ఉన్నాయి భక్తులు రద్దీ తగ్గట్లు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. విద్యుత్ వాడకం 300 యూనిట్లు లోపు ఉన్న వారికి అమ్మ ఒడి కి నిబంధనలు పెట్టడంపై స్పందిస్తూ నిరుపేదలు ఎవరు అంతకన్నా ఎక్కువ వినియోగించారని, సంక్షేమ పథకాలు పేదలకు అందనీ పరిస్థితి రాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాలకమండలి సభ్యులు జయ శ్యామ్, మున్నా, సుమతి సునీత నరసింహులు రమాప్రభ , స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment