పోతురాజు ముగ్గు భక్తులకు అన్నదానం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి గ్రామదేవత ముత్యాలమ్మ జాతర లో భాగంగా రెండో రోజు పూజాది కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిపారు. ఈ పూజారి కార్యక్రమాలకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో పెద్దిరాజు విచ్చేసి పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ మూలవిరాట్టుకు విశేషాలు పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గువేసి శాంతి పూజలు సంప్రదాయ పద్ధతిలో యాదవ కులస్తులు నిర్వహించి, డప్పలు, నృత్యాలతో కొలుపు చేశారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో పెద్దిరాజు ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామదేవతను తృప్తిపరచి అందరూ సుఖశాంతులతో ఉండే విధంగా పట్టణం సుభిక్షంగా ఉండాలని సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.. ఈ పూజాది కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్, రమాప్రభ, సునీతా మరియు స్థానిక వైసిపి నాయకులు శేఖర్, కుమారస్వామి, నరసింహులు, బాల గౌడ్, కళ్యాణ్, ధన, మునిరెడ్డి మరియు ఆలయ అధికారులు మల్లికార్జున్, లక్ష్మయ్య సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment