పర్యవేక్షించిన కమిషనరు బి. బాలాజీ నాయక్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పురపాలక సంఘమునకు ప్రాంతీయ సంచాలకులు గౌరవనీయులు శ్రీ నాగరాజ గారు శ్రీకాళహస్తి పురపాలక సంఘము నందు ఈ రోజు విచ్చేసి పలు వార్డుల నందు జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ కైలాసగిరి కాలనీ నందు ప్రధాన కాలువ మరియు యన్.టి.ఆర్. పార్కు, పానగల్ నందు నూతనముగా నిర్మిచునున్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులను మరియు పట్టణము నందు క్లాప్ ప్రోగ్రామ్ , తడి చెత్త మరియు పొడి చెత్త, శానిటేషన్ పనులను పర్యవేక్షించి పలు అభివృద్ధి కార్యక్రమాల నందు పనులలో నాణ్యత పరిశీలించడమైనది. ఎండా కాలము తీవ్రత దృష్ట్యా ప్రజలకు త్రాగు నీటి కొరత లేకుండా ప్రజలకు మంచినీళ్లు అందించాలని మరియు పట్టణ శివారు నందు కంపోస్ట్ యార్డును పరిశీలించడమైనది. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతము చేయాలనీ సూచించడము జరిగినది. పట్టణము నందలి పలు సచివాలయములను ఆకస్మికముగా పరిశీలించి, సచివాలయము నందు జరుగుతున్న సేవలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని మరియు ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాల పధకములను అర్హులైన ప్రజలందరికి అందేలా చర్యలు గైకొనాలని ఆదేశించడమైనది. శ్రీకాళహస్తి పట్టణము పుణ్య క్షేత్రము కనుక దేశము నలుమూల నుండి భక్తులు విచేయుచున్నందున పట్టణము నందు పారిశ్యుధ్యము మరియు పరిసరములను పరిశుభ్రముగా ఉంచాలని ఆదేశించారు.
కార్యాలయము నందు పనిచేస్తున్న అంతర్గత మరియు బహిర్గత సిబ్బందితో సమావేశము నిర్వహించి ఉద్యోగస్తులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడము జరిగినది. ప్రత్యేకముగా పట్టణము నందలి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రములను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించవలసినదిగా తెలియజేశారు. పట్టణము నందలి అనధికార కట్టడములను మరియు అనధికార లే-అవుట్ లను గుర్తించి తగు చర్యలు గైకొనవలసినదిగా పట్టణ ప్రణాళికాఅధికారి వారిని ఆదేశించారు.
పై కార్యక్రమము నందు కమిషనరు బి. బాలాజీ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment