అర్ధరాత్రి సమయం లో శ్రీ కాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి రుయా లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ కె.వెంకట రమణా రెడ్డి
లారీ మినీ వ్యాన్ ఢీ 4 గురు మృతి.. 8 మందికి గాయాలయ్యాయి
అమ్మవారి దర్శనానికి వచ్చి వెళుతుండగా జరిగిన సంఘటన.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు పై ఉన్న వంతెన వద్ద నాయుడుపేట వైపు నుంచి వెళుతున్న మినీ వ్యాన్ ను లారీ ఢీ కొనడంతో మినీ వ్యాన్ లో ఉన్న వారిలో
4గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కోట మండలం తూర్పు కనుపూరు లో ఉన్న ముత్యాలమ్మ వారికి ఆదివారం ఒక కుటుంబం పొంగళ్ళు పెట్టుకొని తిరిగి స్వగ్రామం కు మినీ వ్యాన్ లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినది.
ఈ ప్రమాదంలో అర్జునయ్య, నరసమ్మ, కావ్య మరొకరు మృతి చెందారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలింపు
క్షతగాత్రులకు అవసరమయిన వైద్య సదుపాయాలు అందిస్తున్న... తిరుపతి రెవన్యూ అధికారులు
No comments:
Post a Comment