అసంపూర్తిగా నిర్మించిన కన్నలికాలువ పనులు పూర్తి చేయాలి మిద్దెలహరి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో మురికి మరియు వరద నీరు ప్రవహించే అతి ప్రధాన కాలువలో కన్నలి కాలవ ఒక్కటి. అసంపూర్తిగా నిర్మించిన కన్నలి కాలువ పనులు పూర్తిచేయాలని RDMA G.నాగరాజు గారికి* , కమిషనర్ B. బాలాజీ నాయక్ గారికి , స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో నాయకులు స్థానిక బాధిత ప్రజలతో కలిసి వినతిపత్రం అందించడం జరిగింది .అనంతరం స్థానిక మహిళలు ఆర్ డి ఎం ఏ కమిషనర్ వారికి వారు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువస్తూ ప్రస్తుతం సున్నపు అరుంధతి వాడ వద్ద ఆగి ఉన్న పనుల వల్ల మురికి నీరు పది అడుగుల లోతుగా చేరి చెక్ డాం తలపించే రీతిలో ఉన్నదని దీనివల్ల దోమల ఉత్పత్తి కేంద్రాలుగా అనేక ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదనతో తెలియజేయడమైనది .వారు వెంటనే స్పందించి 15 వ ఆర్థిక సంఘ నిధులతో మిగిలిన కన్నలి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడమైనది. అనంతరం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి మాట్లాడుతూ 2016 సంవత్సరంలో లో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక పోరాటాలు, ధర్నాలు, ఉద్యమాలు చేసి సాధించిన కన్నలి కాలువ నిర్మాణము ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా పూర్తి చేసుకోలే కపోవడం బాధాకరమని తెలియజేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖవారి నిర్లక్ష్యం ఉదాసీనత వల్ల పీడిత పేద దళిత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేస్తూ మన ప్రియతమా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక సమస్యల పరిష్కార దిశగా సంక్షేమ పథకాల అమలు తీరు లబ్ధి గురించి ప్రతి గడపకు తెలియజేయాలని కార్యకర్తలకు ,నాయకులకు పిలుపునిచ్చారని అందులో భాగంగా స్థానిక సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వచ్చి ఒత్తిడి చేసి పరిష్కార దిశగా పనిచేస్తామని తెలిపారు. వై ఎస్ ఆర్ సి పి పట్టణ మాజీ అధ్యక్షులు కొట్టిడ్డి మధు శేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా దీవెన యాత్రలో గడపగడపకు ఇచ్చిన హామీలను నెరవేర్చి కోవడం పార్టీ అధినాయకత్వం తప్పుగా భావిస్తూ ప్రస్తుతం వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటివి పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో లో మాజీ కౌన్సిలర్లు వసంతమ్మ, నాగరాజ మ్మ, నాయకులు యతి రాజులు, ప్రముఖ న్యాయవాది రమణయ్య, తిరుపాలయ్య ఇసుక పట్ల బాల, దావలగిరి, గంజీ వెంకటేష్, రామచంద్ర , చల్ల సుధాకర్, వెంకటేష్, బాబు , వెంకటయ్య, ప్రమీల, గోవర్ధన అమ్మ, సంపూర్ణమ్మ, పార్వతమ్మ, రావమ్మా, వెంకటయ్య, జగ్గు తదితరులు మిద్దెల హరి యువసేన నాయకులు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment