శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి. రాష్ట్ర స్థాయి బంగారు పథకం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, April 4, 2022

శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి. రాష్ట్ర స్థాయి బంగారు పథకం

 రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో బంగారు పథకం సాధించిన శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మార్చ్ 30 ,31   వ తేదీ అనంతపురం  లోని చికిచెర్ల లోని జడ్పీ హై స్కూల్ నందు  రాష్ట్ర జూడో టోర్నమెంట్ జరిగినది. రాష్ట్ర స్థాయి పోటీలోని జూడో విభాగంలో చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఆర్ ఝాన్సీ  అండర్ -14 విభాగము,సబ్ జూనియర్, 52 కేజీ లెవల్ లో బంగారు పథకం పొందారు. మరియు చిత్తూర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ రావడానికి ఈ బంగారు పథకం దోహదపడినది.  మన రాష్ట్ర స్థాయిలో సుమారు 5 మంది జూడో ప్లేయర్ లు బెస్ట్ ప్లేయర్ అవార్డు లో ఆర్ ఝాన్సీ కూడా ఉండడం గర్వకారణంగా వుంది. బెస్ట్ ప్లేయర్ అవార్డు త్వరలో విజయవాడలో అందుకుంటోంది అన్నారు.

ఈ సందర్భముగా పాఠశాల ఇంచార్జి ప్రధానఉపాధ్యాయులు శివకుమార్, శాప్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ జూడో కోచ్ గోపి, పాఠశాల పిడిలు వెంకటముని, ఇందిరా, సరోజ ..మొదలైనవాలు చిన్నారిని అభినందిచి, ఆశీర్వదిచారు.

పాఠశాల ఇంచార్జి ప్రధానఉపాధ్యాయులు శివకుమార్ మాట్లాడుతూ... విద్యార్థి దశలో ఆటలపోటీలలో ఉతీర్ణత సాధించిన వారికీ శారీరక దృఢత్వము, మానసిక ఉలాసముగా ఉంటుందని, అలాగే వారి భావి భవిషతుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యముగా మన పాఠశాలనుంచి రాష్ట్ర స్థాయిలో విజయంసాధించిన విదార్థిని ప్రతేక శుభాకాంక్షలు. ఇలాంటి ఆణిముత్యాలు మన పాఠశాలనుంచి ఎంతోమంది విదార్థులు ఉన్నతస్థాయిలో ఉండడం చాల సంతోషముగా ఉందని అన్నారు.

బంగారు పథకం విజేత ఝాన్సీ మాట్లాడుతూ.... మా గురువులు, తల్లితండ్రుల ప్రోత్సహమే నా విజయానికి తోడ్పడినది. అలాగే రాబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని మా పాఠశాల పేరు నిలబెడతానని అన్నారు.

ఝాన్సీ తల్లి మాట్లాడుతూ.... మా లాంటి పేద కుటుంబమునకు ఇలాంటి ఆటలపోటీలు మా బిడ్డ బావి భవిషత్తు కు ఉపయోగపడాలని, అలాగే పాపా గురువుల ప్రోత్సహంతోనే ఇంత స్థాయి ఎదిగిందని అన్నారు. నాకు చాల సంతోషముగా ఉందని అన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad