మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపు గా సింహవాహనం సేవ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపు గా అమ్మవారి కి సింహవాహనం సేవ గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాలు నడుమ వైభవోపేతంగా ఊరేగించారు. సింహ వాహనంపై దర్శనం ఇచ్చిన గొబ్బెమ్మ తల్లి నీ దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందం తో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి, సిరిసంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్ధించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో , ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్,హరి యాదవ్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్,రాజా, శేఖర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment