శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ ఉత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సంక్రాంతిపండుగలో భాగంగా కనుమ పండుగ పురస్కరించుకొని గిరి ప్రదర్శనకు కదలిన ఆదిదంపతులు..
భగవంతుడు.. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి బంధుగణాన్ని, సమస్త భక్తగణానికి స్వాగతంపలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. ప్రత్యేక అతిధిగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
శ్రీకాళహస్తిదేవస్థానంనందు అలంకారంమండపంలో స్వామి అమ్మవార్లు ఉదయం అలంకార మండపంలో పార్వతీపరమేశ్వరులు ప్రత్యేక అలంకరణతోముస్తాబు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గిరిప్రదక్షిణకు ఆదిదంపలు గిరి ప్రదర్శనకు బయలుదేరారు. ప్రత్యేక అతిధిగా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు
వాయులింగేశ్వరుడు తమ కళ్యాణానికి ముక్కోటి భక్తజన కోటికి, మునులకు ఋషులకు స్వాగతం పలికేందుకు గిరిప్రదక్షిణ చేశారు. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ.. భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంభులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో.. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. అడుగడుగునా భక్తకోటి స్వామివారికినీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు.
No comments:
Post a Comment