పేదల సేవే తన పరమార్థమని వైసీపీ నాయకుడు కలవగుంట భరత్ రెడ్డి అన్నారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి సూచనల మేరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని మంగళవారం తొట్టంబేడు మండలం బీడీకాలనీలో 35 కుటుంబాల ముస్లింలకు చికెన్, గుడ్లు, గోధుమపిండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ... రంజాన్ వేళ పేద ముస్లిం కుటుంమబాలకు తనవంతు సాయం చేయాలనే ఆశయంతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు సేవ చేయడంలో తనకు ఎంతో సంతృప్తి ఉంటుదన్నారు. ఈ కార్యక్రమంలోవెంకీ ,కార్తీక్ ,దన శేఖర్ ,భాషా ,పజల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment